సీసం: అలనాడు అలరించె ఆంధ్ర రాజుల్ తమ
పెరటి తోటందు పెంచి తెలుగు
ఈనాడు పెంచిరి ఈర్ష్యతో పాలకుల్
వీధి బయటికిని విసిరి వేసి
తెలుగు యనగ నాడు వెలుగులు నిండెను
చీకటి తెరలన్ని చెదిరిపోయి
ఈనాడు యెటుచూడ నిండమావాస్యలు
పిలువగా రాదయ్య తెలుగు పులుగు
ఆ.వె: యెచ్చటికిని బోయి యెచట దాక్కుండెనో
తెల్గు భాష నందు వెల్గుధనము
ఆదరణయు లేక అనాథైపోయెనో
కనబడుటయు లేదు కలియ జూడ
ఆ.వె: తెల్గు భాష నందు తీయగా పలుకగా
చెప్పు తీసికొట్టు తప్పుయనుచు
అన్య భాషనందు అచ్చు తప్పు పలుక
బాగు బాగు యనెడి పాప జనులు
4 comments:
తెలుగు కు పూర్వ వైభవం తీసుకురావటానికి మనం అందరం క్రుషి చేయాలి. తెలుగు మాట్లాడటం నామోషీ గా భావించే రోజులు పోవాలి. తెలుగు మాట్లాడలేని మన ఆత్మన్యూనతాభావాన్ని తొలగించాలి.
చాలా బాగా చెప్పారు...
పారుపల్లి గారు చెప్పినట్టు మనమంతా కలిసి తెలుగు భాషను బ్రతికిద్దాము !!
తెలుగు ను వెలిగించడానికే "పొద్దు" పొడిచింది.అందరు తలా ఒక చెయ్యి వెయండి.ముఖ్యం గా మీ సహకారం చాలా అవసరం.
http://poddu.net/
నా కవితను చదివి మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు
Post a Comment