యిజాల కోసం
నిజాలు దాచే
బీజాలు నాటిన ఆధునికం.
రోజులు గడిచినా మోజుల కోసం
బజారుకెక్కిన యువతరం.
ఆకలి వేస్తే కేకలు వేసినా
నూకలు దొరకనిదీ కలియుగం.
ఫ్యాషన్ల ఓషియన్ల
ఉత్తుంగ తరంగాల తాకిడికి తట్టుకోలేక
భారతీయ సంస్కృతి బద్దలగుచున్నది.
నిషీధిని జయించాలని
ఉషోదయానికి ఉరుకులాట.
తెల్లారిందంటే బడుగు జీవులది
కూటికోసం వెతుకులాట.
లంగాలుంగీలను చితగ్గొట్టి
జీన్సుప్యాంటు డ్యాన్సు చేస్తున్నది.
ఖద్దరు చొక్కాలను తోసేసి
టీషర్టు టికెట్టు కొంది.
ప్రపంచమంతా ప్రభాతం కోసం
పరీక్షగా నిరీక్షిస్తుంది.
చీకటిలోని చేదునిజాలను
అసమర్థతతో వీక్షిస్తుంది.
తెల్లారిందంటే చాలు
ఎక్కడో ఒక (ఆత్మ)హత్య.
నిజం చెప్పాలంటే తెల్లారడమే ఒక హత్య.
Friday, December 29, 2006
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
తెల్లారిందంటే చాలు
ఎక్కడో ఒక (ఆత్మ)హత్య.
నిజం చెప్పాలంటే తెల్లారడమే ఒక హత్య.
adbhuta.antakanna vere padam kanipincatledu naaku mii kavitani mechukoadaniki
inta talent pettukuni em chestunnavu basuuuuuuuuuuuuuu
ప్రపంచమంతా.... హత్తుకుంటోంది మీ పోయెట్ సొబగు
Post a Comment